బావిలో పడి వ్యక్తి మృతి

- October 01, 2019 , by Maagulf
బావిలో పడి వ్యక్తి మృతి

మస్కట్‌: ఓ వ్యక్తి బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. పబ్లిక్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ పిఎసిడిఎ ఈ విషయాన్ని వెల్లడించింది. అల్‌ దహిరాహ్‌ గవర్నరేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన వాటర్‌ రెస్క్యూ టీమ్‌, బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీయగలిగింది. విలాయత్‌ యాంకుల్‌లోని ఓ బావిలో వ్యక్తి పడిపోగా, అతను మృతి చెందాడనీ, మృతదేహాన్ని వెలికి తీశామనీ పిఎసిడిఎ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com