కారు దొంగతనం: గంటలో రికవరీ
- October 01, 2019
దుబాయ్:ఇద్దరు దుబాయ్ పోలీసులు, దొంగిలించబడిన కారుని కేవలం గంట లోపే రికవరీ చేయగలిగారు. దుబాయ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, దొంగిలించబడిన టొయోటో కారు గురించిన సమాచారాన్ని అందుకోగానే, పోలీసులు రంగంలోకి దిగారు. అల్ ఖుసైస్ పోలీస్, ఈ ఆపరేషన్ చేపట్టింది. తన కుమారుడ్ని స్కూల్‌లో దించి వస్తున్న సమయంలో తన కారుని దొంగిలించినట్లు బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. క్షణాల్లో కారు దొంగిలించబడిన సమాచారాన్ని పోలీస్ పెట్రోల్‌కి అందించగా, గంట వ్యవధిలోనే ఆ కారుని పోలీసులు పట్టుకోగలిగారు. ఇంజిన్ రన్నింగ్‌లో వున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కారు దిగి, దూరంగా వెళ్ళవద్దని అధికారులు ఈ సందర్బంగా వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







