'లవ్-జీహాద్' ఉచ్చులో కేరళ యువతి: అసలు నిజం ఇదీ!
- October 03, 2019
అబుదాబీ: అబుదాబీకి చెందిన ఇండియన్ ముస్లిం యువకుడు, కేరళకు చెందిన 19 ఏళ్ళ క్రిస్టియన్ యువతిని కిడ్నాప్ చేసినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది బాధిత కుటుంబం. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అబుదాబీకి చేరుకున్న 19 ఏళ్ళ యువతి సియాన్ని బెన్నీ, తన పేరుని ఐషాగా మార్చుకుంది. అయితే, తాను మనస్ఫూర్తిగానే తాను ప్రేమించిన వ్యక్తితో అబుదాబీ వచ్చాను తప్ప, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అంటోంది ఐషాగా మారిన సియాన్ని బెన్నీ. కుమార్తె కోసం అబుదాబీకి చేరుకున్న బాధిత కుటుంబం వాదనని సైతం పోలీసులు పరిగణనలోకి తీసుకుని, కేసుని విచారిస్తున్నారు. కాగా, 27 ఏళ్ళ ఇండియన్ ముస్లిం యువకుడు రషీద్, అబుదాబీలోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్నారు. ఐషా అనే పేరుతో వున్న సోషల్ మీడియా ప్రొఫైన్తో తనకు పరిచయం ఏర్పడిందనీ, ఆ తర్వాత తామిద్దరం ప్రేమించుకున్నామనీ, తానెలాంటి లవ్ జిహాద్కీ పాల్పడేలదని రషీద్ చెప్పాడు. తొమ్మిది నెలల ప్రేమ తర్వాత ఐషా తన అసలు పేరు చెప్పిందనీ, అప్పటికే ప్రేమలో వున్న తాము, తమ ప్రేమకు మతం అడ్డు కాదని అనుకున్నామని రషీద్ వివరించాడు. అతి త్వరలో తాము పెళ్ళి చేసుకుని, ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నట్లు రషీద్ వెల్లడించాడు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







