బాదంతో ఆరోగ్య ప్రయోజనాలు
- October 07, 2019బాదం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే సంగతి తెలిసిందే. రోజూ క్రమం తప్పకుండా బాదం గింజలు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. స్నాక్స్‌గా వీటిని తీసుకోవడం బెస్ట్ ఛాయిస్ అని న్యూట్రిషియనిస్టులు చెబుతున్నారు. వీటిలో విటమిన్-ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోప్లోవిన్, మాంగనీస్, కాపర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి.
రోజూ గుప్పెడు (దాదాపు 23) బాదం గింజలను స్నాక్స్‌గా తీసుకుంటే.. 161 కెలోరీల శక్తి శరీరానికి అందుతుంది. 2.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అందుతాయి. వీటిలో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రొటీన్లు, ముఖ్య పోషకాలు ఉంటాయి.
బాదం గింజలు యాంటీ ఆక్సిడెంట్లు. కణాలు దెబ్బతినకుండా ఇవి కాపాడతాయి. కణాలు దెబ్బతినడం ద్వారా త్వరగా వృద్ధాప్యం దరి చేరడంతోపాటు జబ్బుల బారిన పడతారు. స్మోకింగ్ చేసేవారు బాదం గింజలు తింటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది.
బాదంలో విటమిన్-ఇ అధిక మోతాదులో ఉంటుంది. గుండె జబ్బులు, కేన్సర్, అల్జీమర్స్ ముప్పు తగ్గడానికి.. విటమిన్-ఇ ఎక్కువగా తీసుకోవడానికి మధ్య సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది.
రక్తంలోని చక్కెర స్థాయిలను బాదం నియంత్రిస్తుంది. వీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. రక్తంలోని ఎల్డీఎల్ లిపోప్రొటీన్స్ను బాదం తగ్గిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. బాదం తినడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు