అమెరికాకు వెళ్తున్న మరికొందరు తెలుగు విద్యార్థులకు షాక్!
- January 10, 2016
అమెరికాకు వెళ్తున్న మరికొందరు తెలుగు విద్యార్థులకు షాక్ తగిలింది. తాజాగా న్యూయార్క్ వెళ్లిన మరో ఇరవై రెండు మందిని తిప్పి పంపించారు. ఈ నెల 7వ తేదీన అమెరికా వెళ్లిన వారిని న్యూయార్క్ విమానాశ్రయంలో అధికారులు ఇబ్బందులకు గురి చేసి, ఆ తర్వాత తిప్పి పంపించారు.సమాచారం మేరకు... న్యూయార్క్ చేరుకున్నాక అధికారులు... విద్యార్థులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంత గుంపులుగా ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. చాలామందిని వెనక్కి పంపిస్తున్నప్పటికీ మళ్లీ ఎందుకు వస్తున్నారని నిలదీశారు.చదువుకునేందుకు ఇక్కడిదాకా ఎందుకని ప్రశ్నించారు.అంతేకాదు.. తమకు బేడీలు వేసి విమానాశ్రయంలో తిప్పారని, వెంటనే వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారని విద్యార్థులు వాపోయారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, న్యూయార్క్ నుంచి వచ్చిన విద్యార్థులు శనివారం రాత్రి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు.శంషాబాద్ చేరుకున్న తమను టికెట్ డబ్బులు చెల్లించాలని ఎయిర్ ఇండియా సిబ్బంది అక్కడే కూర్చోబెట్టారని విద్యార్థులు ఆరోపించారు. అర్ధరాత్రి వరకు అలాగే కూర్చోబెట్టారు. అదే సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ విమానాశ్రయం నుంచి బయటకి వస్తుండడంతో అక్కడే నిరీక్షిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనను అడ్డుకుని విషయం చెప్పారు.పలువురు తల్లిదండ్రులు కంటతడి పెట్టడంతో అలీ ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడి విద్యార్థులను వదిలిపెట్టేలా చర్యలు తీసుకున్నారు. తెలుగు విద్యార్థుల ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమెరికా దృష్టికి తీసుకెళ్లిందని అలీ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







