టెక్నికల్‌ ఎర్రర్‌: సర్వీస్‌ని రద్దు చేసిన దుబాయ్‌ మెట్రో స్టేషన్‌

- October 09, 2019 , by Maagulf
టెక్నికల్‌ ఎర్రర్‌: సర్వీస్‌ని రద్దు చేసిన దుబాయ్‌ మెట్రో స్టేషన్‌

దుబాయ్‌ మెట్రోలో సాంకేతిక సమస్య తలెత్తింది. బుధవారం ఉదయం తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా, ఓ స్టేషన్‌లో సర్వీసెస్‌ రద్దయ్యాయి. ఈ మేరకు దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఓ ప్రకటన చేసింది. షరాఫ్‌ డిజి స్టేషన్‌ వద్ద మెట్రో సర్వీస్‌ తాత్కాలికంగా ఎఫెక్ట్‌ అయ్యిందనీ, అత్యవసర సర్వీసెస్‌ బృందం, సమస్యను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోందనీ, మిగతా స్టేషన్లు యధాతథంగా సేవలు అందిస్తున్నాయనీ అధికారులు పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com