వెదర్ అలర్ట్: రానున్న ఐదు రోజుల్లో యూఏఈకి వర్ష సూచన
- October 11, 2019
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన తాజా వివరాల ప్రకారం యూఏఈలోని పలు ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో ఆకాశం మేఘావృతమయి వుంటుందనీ, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయనీ తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చితే, స్కూల్ యాజమాన్యాలు క్లాసుల్ని రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తూ మినిస్ట్రీ సూచనలు చేసింది. స్టూడెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ మరియు టీచింగ్ స్టాఫ్ త్వరగా ఇళ్ళకు చేరే విధంగా స్కూల్ సమయాల్ని మార్చుకునేందుకూ వీలు కల్పించింది మినిస్ట్రీ. ప్రధానంగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాల్లోని స్కూళ్ళు అప్రమత్తంగా వుండాలని స్కూల్ ఆపరేషన్స్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ సూచించారు. అక్టోబర్ 11 నుంచి 15 వరకు యూఏఈలోని వాతావరణ పరిస్థితులు స్థిరంగానే వుంటాయి. సాధారణ నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఎన్‌సిఎం హెచ్చరిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో అలల తీవ్రత కూడా సాధారణ నుంచి ఓ మోస్తరుగా వుండొచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..