బ్యూటీ క్వీన్ రేసులో దూసుకెళ్తున్న దుబాయ్ యువతి
- October 12, 2019
ఇండియాలోని ముంబైకి చెందిన రిషికా గుప్తా, దుబాయ్‌లోని అమిటీ యూనివర్సిటీలో అండర్గ్రాడ్యుయేట్గా విద్యనభ్యసిస్తున్నారు. 20 ఏళ్ళ రిషిక, తాను ఐదేళ్ళుగా దుబాయ్‌లోనే వుంటున్నాననీ, దుబాయ్ తన సొంత ఇల్లులా మారిపోయిందని చెప్పారు. ఇటీవల ముంబైలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో యూఏఈ తరఫున రిప్రెజెంట్ చేశారు రిషిక. ఈ పోటీలకు ముందు ఆమె మిస్ ఇండియా యూఏఈ టైటిల్‌ని స్టార్ హంట్ 2018 కాంటెస్ట్‌లో గెల్చుకున్నారు. 2018లో ఈ టైటిల్ ఆమెను వరించింది. స్వతహాగా మేకప్ ఆర్టిస్ట్ అలాగే యంగ్ స్టూడెంట్ అయిన రిషిక, సొంతంగా కొరియోగ్రఫీ కూడా చేసుకోగలరు. ఫ్యాషన్ షోలు, కల్చరల్ ఈవెంట్స్‌లో తనకు తాను ఆమె కొరియోగ్రఫీ చేసుకుంటారు. కాన్సెప్ట్‌లను కూడా డిజైన్ చేసుకుంటారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







