పసుపుతో ఉపయోగాలు...

- October 13, 2019 , by Maagulf
పసుపుతో ఉపయోగాలు...

పసుపు ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. దీన్ని రోజూ తినే ఆహారంలో చేరిస్తే ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో లాభాలు పొందొచ్చు. దీనికి కారణం ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని కేవలం వంటల్లో మాత్రమే కాకుండా.. ఆరోగ్యపరంగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. చిటికెడు పసుపుతో అనేక ప్రయోజనాలు ఉంటాయి.

1. గాయాల వల్ల నొప్పి, వాపులను చిటికెలో తగ్గించగల అద్భుత ఔషధం పసుపు.

2. గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే ఎసిడిటీ, హార్ట్‌బర్న్ వంటి సమస్యలు మటుమాయం.


3. కడుపులో వికారంగా అనిపించినప్పుడు ఒక కప్పు వేడినీళ్లలో అర టీస్పూన్ పసుపు, అల్లం రసం కలిపి తాగితే వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు.


4. పసుపులో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటి న్యూట్రిషియన్స్ బోలెడన్ని ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటే, జీవక్రియలు సక్రమంగా జరగడానికి సహాయపడుతాయి.

5. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణలక్షణాలతో పాటు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.


6. కేన్సర్ కణాలతో పోరాడే లక్షణాలు పసుపులో పుష్కలంగా ఉంటాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. ఇంకా ఎన్నో ఔషధ గుణాలకు పసుపు కేరాఫ్ అడ్రస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com