సౌదీ అరేబియా లో ఏ.పి వాసి హత్య
- October 13, 2019
సౌదీ అరేబియాలో విశాఖపట్నం కు చెందిన సేల్స్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న అబ్దుల్ అయాజ్(54)అల్ ఖర్మ లో హత్యకు గురయ్యారని, అయితే మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు తీవ్ర జాప్యం జరుగుతోందని అయాజ్ కుమార్తె సమీనా షేక్ చేసిన ట్వీట్‌తో యంత్రాంగం చర్యలకు దిగింది. ఈ జాప్యంపై సమీనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ట్వీట్ చేయటంతో అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు విశాఖ పోలీసులు వీరి వివరాల కోసం ఆరా తీశారు. అయితే ఈ కుటుంబ వివరాల కోసం విశాఖపట్నం లో ఎంత ప్రయత్నించినా తెలియలేదు. సమీనా కూడా ఈ సంఘటనపై ఎక్కడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో చిరునామా తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. అయితే బాధిత కుటుంబం దౌత్య కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అధికారులు మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..