బజ్జున్న బుజ్జోడు....బస్సు లోనే దొరికాడు!!
- January 11, 2016
బడిలో అలసి సొలసి పోయిన బుడతడు స్కూల్ బస్సులో హాయిగా నిద్రపోయాడు. అందరు పిల్లలను వారి వారి ఇళ్ళ వద్ద దించేసిన ఆ డ్రైవర్ బస్సును చీకటి పడిన తర్వాత షెడ్డులోనికి పెడ్తూ , వెనక్కి తిరిగచూసేసరికి , అమాయకంగా కిండర్ గార్డెన్ బుదతడు సీట్లో పడుకొని నిద్రపోవడం చూసి ఉలిక్కిపద్డాడు. వెంటనే తేరుకొని...తిరిగి అదే బస్సును నడుపుకొంటూస్కూల్ కు వచ్చి ఆ చిన్నారిని భద్రంగా యాజమాన్యానికి అప్పచెప్పి అందరి చేత ' శభాష్ ' అనిపించుకుంటున్నాడు ఆ డ్రైవర్. ఇదేదో చిన్న విషయమే కదా అని కొట్టిపారేసేవారికి ఏమీ చెప్పలేము కాని, ఇందులో ఎన్నోమానవీయ కోణాలు...మరెంతో సామాజిక స్పృహ వంటి పలు అంశాలు ముడుపడి ఉన్నాయి. ఈ వార్త వివరాలలోనికి వెళితే , దరసైట్ లోని ఒక ఇండియన్ స్కూల్ లో కిన్దర్ గార్డెన్ సిసింద్రి స్కూల్ బస్సులో నిద్రపోయి పలువురికి సాయంత్రం వెళ చుక్కలు చూపించాడు. చివరికి పైన పేర్కొన్న విధంగా కధ సుఖాంతం అయ్యేసరికి అందరూ ఊపిరిపీల్చుకొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ స్కూల్ మేనేజ్మెంట్ బోర్డు అఫ్ డైరక్టర్ చైర్మన్ జార్జ్ విల్సన్ మాట్లాడుతూ , తమ బస్సు డ్రైవర్ అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







