ఆసియా మహిళతో బలవంతపు వ్యభిచారం!

- October 21, 2019 , by Maagulf
ఆసియా మహిళతో బలవంతపు వ్యభిచారం!

బహ్రెయిన్‌: ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళను బలవంతంగా వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారనే అభియోగాలపై విచారణ ఎదుర్కొంటున్నారు. బాధితురాలు, స్థానికంగా వున్న ఓ కుటుంబానికి మెయిడ్‌గా పనిచేస్తోంది. అయితే, బాధితురాలికి ఫేక్‌ జాబ్‌ ఆపర్చ్యూనిటీ చూపించారు. దాన్ని నమ్మిన బాధితురాలు, తన ఎంప్లాయర్‌ నుంచి పారిపోయి, నిందితులకు వద్దకు చేరింది. నిందితులు ఆమెను ఓ గదిలో బంధించి, ఇతర వ్యక్తుల్ని ఆమె వద్దకు పంపించి డబ్బు సంపాదించారు. పలువురు మహిళల్ని ఇలాగే నిందితులు ట్రాప్‌ చేసినట్లు విచారణలో తేలింది. కేసు విచారణ కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com