హాంకాంగ్ లో రెచ్చిపోయిన నిరసనకారులు

- October 21, 2019 , by Maagulf
హాంకాంగ్ లో రెచ్చిపోయిన నిరసనకారులు

అల్లర్లతో హాంకాంగ్ మళ్ళీ ఉద్రిక్తమైంది. ప్రజాస్వామ్య అనుకూలవాదులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఆదివారం వీధుల్లో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయడమే కాకుండా.. బస్సులు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. చైనాకు చెందిన వ్యాపార సముదాయాలపైనా దాడులకు పాల్పడుతూ.. ఒక సమయంలో రెచ్చి పోయి.. పోలీసులపై పెట్రోలు బాంబులు విసిరారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో సుమారు 24 మంది గాయపడ్డారు. వీరిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హాంకాంగ్ లో పోలీసుల దమనకాండను అణచివేయాలని, రాజకీయ హక్కులను పునరుధ్దరించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.. కాగా ఆ మధ్య నేరస్థుల అప్పగింత బిల్లుకు నిరసనగా సుమారు నాలుగు నెలల పాటు హాంకాంగ్ వీరి ఆందోళను, ఉద్యమాలతో హోరెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొంత తేరుకొంటున్న పరిస్థితులు ఏర్పడుతుండగా తిరిగి ఈ నగరం హింసతో ' కాక ' రేగుతోంది. చైనా జెండాలను నాజీ స్వస్తిక్ గుర్తుతో పోలుస్తూ ఆ దేశానికి వ్యతిరేకంగా ఉద్యమకారులు మళ్ళీ చెలరేగడంతో పాలకవర్గం తలలు పట్టుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com