ప్రపంచంలోనే అతి పెద్ద త్రీడీ ప్రింటెడ్ స్ట్రక్చర్
- October 23, 2019
దుబాయ్ మునిసిపాలిటీ, ప్రపంచంలోనే అతి పెద్ద త్రీడీ ప్రింటెడ్ స్ట్రక్చర్‌ని వార్సన్ ఏరియాలో ఆవిష్కరించింది. సీనియర్ మునిసిపాలిటీ అధికారులు మాట్లాడుతూ, 640 చదరపు మీటర్ల ఏరియాలో 9.5 మీటర్ల ఎత్తులో రెండు అంతస్తుల భవనం త్రీడీ ప్రింటెడ్ స్ట్రక్చర్‌గా రూపొందిందని తెలిపారు. దుబాయ్‌లో ఈ తరహా భవనాలు ముందు ముందు మరిన్ని నిర్మితమవుతాయని దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ దావూద్ అల్ హజ్రి చెప్పారు. ఈ బిల్డింగ్ ఇన్నోవేషన్ సెంటర్‌గా వినియోగిస్తారు. ఏడాది సమయంలో ఈ బిల్డింగ్ నిర్మాణం (ప్రింటింగ్) జరిగింది. సాధారణ పద్ధతుల్లో అయ్యే ఖర్చులో సగం ఖర్చుతో ఈ భవన నిర్మాణం జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. 1 మిలియన్ దిర్హామ్‌ల వరకు ఈ నిర్మాణానికి ఖర్చవుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







