ఒమన్‌లో ఇల్లీగల్‌ మైగ్రెంట్స్‌ అరెస్ట్‌

- October 23, 2019 , by Maagulf
ఒమన్‌లో ఇల్లీగల్‌ మైగ్రెంట్స్‌ అరెస్ట్‌

మస్కట్‌: 11 మంది ఇల్లీగల్‌ ఇమ్మిగ్రెంట్స్‌ని డిపోర్ట్‌ చేయడంతోపాటు, మరో 63 మందిని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. గత వారం ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్ట్‌ అయిన నిందితులు వివిధ దేశాలకు చెందినవారనీ, వారంతా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు తెలిపారు. యాంటీ ఇన్‌ఫిలిట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ - డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ అండ్‌ రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. సుల్తానేట్‌లోని వివిధ విలాయత్స్‌ నుంచి 26 ఇన్‌ఫిలిట్రేటర్స్‌ని అరెస్ట్‌ చేయడం జరిగిందని అధికారులు చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com