భారత వలసదారుడి ఆత్మహత్య

- October 24, 2019 , by Maagulf
భారత వలసదారుడి ఆత్మహత్య

కువైట్‌: భారతీయ వలసదారుడొకరు, షువైఖ్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఓ షాప్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, ఘటనా స్థలానికి పోలీస్‌ అలాగే పారామెడిక్స్‌ చేరుకోవడం జరిగింది. అయితే, అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మెడకు ఉరి వేసుకుని ఆ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com