దీపావళి స్పెషల్: ఊపందుకున్న ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ సేల్
- October 26, 2019
యూఏఈ: బుర్ దుబాయ్ మీనా బజార్లో సేల్స్‌మెన్, కౌంటర్ఫీట్ బ్రాండెడ్ బ్యాగ్స్, వాచ్‌లు, పెర్ఫ్యూమ్లను అతి తక్కువ ధరలకు విక్రయించడం సర్వసాధారణం. అయితే దివాలీ సందర్భంగా ప్రతి ముగ్గురు అమ్మకందార్లలో ఒకరు ఇల్లీగల్ క్రాకర్స్‌ని అతి తక్కువ ధరలకు విక్రయిస్తుండడం కన్పిస్తోంది. దుబాయ్‌లో ఈవెంట్ ఆర్గనైజర్స్, దుబాయ్ పోలీస్ అలాగే దుబాయ్ మునిసిపాలిటీ నుంచి అనుమతులు పొందితేనే క్రాకర్స్‌ని పేల్చేందుకు వీలుంటుంది. కానీ, ఇల్లీగల్ క్రాకర్స్ విక్రయాలు మాత్రం చాపకింద నీరులా జరిగిపోతున్నాయి. ఆరు ప్యాకెట్ల ఫైర్ క్రాకర్స్ 120 దిర్హామ్‌లకు లభిస్తున్నాయి. 100 చిన్న క్రాకర్స్ టవఱున్న ప్యాక్ 50 దిర్హామ్‌లకు దొరుకుతోంది. కాగా, స్కై రాకెట్స్కి ఎక్కువగా డిమాండ్ వున్నట్లు కన్పిస్తోంది. శుక్రవారం వీటి అమ్మకాలు తారా స్థాయికి చేరుకున్నాయి. వినియోగదారులు 300 నుంచి 500 దిర్హామ్‌లు సైతం వెచ్చిండానికి వెనుకాడడంలేదు. కాగా, గత కొన్నేళ్ళుగా దుబాయ్ పోలీస్, ఇల్లీగల్ క్రాకర్స్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినాగానీ, అక్రమంగా అమ్మకాలు కొనసాగుతూనే వున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..