2015లో 454 మిలియన్ ఖతారీ రియాల్స్‌తో ఈద్ ఛారిటీ
- January 11, 2016
ఈద్ బిన్ మహమ్మద్ అల్ థని ఛారిటబుల్ అసోసియేషన్ 2015లో 59 దేశాల్లో సేవా కార్యక్రమాల్ని చేపట్టింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాల్ని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. 5700 ప్రాజెక్టుల్ని సంస్థ చేపట్టింది. రిలీఫ్ కార్యక్రమాల కోసం సుమారు 118 మిలియన్ ఖతారీ రియాల్స్‌ని వెచ్చించారు. ఇందులో సిరియా శరణార్ధుల కోసమే ఎక్కువ భాగం వెచ్చించడం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ షేక్ ఈద్ బిన్ మహమ్మద్ అల్ థని ఓవర్సీస్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యిందనీ, 5772 ప్రాజెక్టుల్ని 394 మిలియన్ ఖతారీ రియాల్స్‌తో చేపట్టామని అన్నారు. లోకల్ కల్చర్లన మరియు అడ్వొకసీ ప్రాజెక్టులు మరో 60 మిలియన్ ఖతారీ రియాల్స్‌తో చేపట్టారు. 59 దేశాల్లో చేపడ్తున్న హ్యుమానిటేరియన్ కార్యక్రమాల ద్వారా అసోసియేషన్ రెవెన్యూ 560 మిలియన్ ఖతారీ రియాల్స్‌కి చేరుకుంది. అసోసియేషన్ నేతృత్వంలో 469 మసీదులు, అవసరమైనవారికి 359 ఇళ్ళను నిర్మించి ఇచ్చారు. అలాగే 2852 వాటర్ ప్రాజెక్టుల్ని చేపట్టింది అసోసియేషన్.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







