న్యూ ఎట్రాక్షన్స్: నవంబర్ 1న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ప్రారంభం
- October 28, 2019
దుబాయ్ మిరాకిల్ గార్డెన్ తన ఎనిమిదవ సీజన్‌ని నవంబర్ 1న ఆవిష్కరించుకోనుంది. దుబాయ్‌ల్యాండ్‌లో 72,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఇది ఏర్పాటయ్యింది. 120 రకాలకు చెందిన 50 మిలియన్ ఫ్లవర్స్ తమ పరిమళాల్ని ఈ మిరాకిల్ గార్డెన్‌లో వెదజల్లుతాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వీకెండ్స్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ గార్డెన్ సందర్శకులకు అందుబాటులో వుంటుంది. కాగా, 12 ఏళ్ళ వయసు దాటినవారికి 55 దిర్హామ్‌లు, 12 ఏళ్ళ లోపు పిల్లలకు 40 దిర్హామ్‌లు టిక్కెట్ ధరగా నిర్ణయించారు. మూడేళ్ళ లోపు పిల్లలకు అలాగే పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌కి ప్రవేశం ఉచితం. ఈసారి గార్డెన్‌లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలుండబోతున్నాయని నిర్వాహకులు తెలిపారు. 400 మీటర్ల పొడవున కొత్త వాకింగ్ ట్రాక్‌ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







