అడుగుదూరంలో అంబానీ : ఇండియా అలీబాబా ఈ-కామర్స్ ప్లాట్ ఫాం
- October 28, 2019
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, బిలియనీర్ ముఖేశ్ అంబానీ ఇండియాలో అలీబాబా ఈకామర్స్ సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ఒక అడుగు ముందుకు వేశారు. 24 బిలియన్ డాలర్ల డిజిటల్ సర్వీసెస్ హోల్డింగ్ కంపెనీని స్థాపించే ప్రణాళికలను ఆయన ఆవిష్కరించారు. ఇది దేశంలోని ఇంటర్నెట్ షాపింగ్ ప్లాట్ ఫాంపై ఆధిపత్యం చెలాయించాలనే తన ఆశయంలో ప్రధాన వాహనంగా మారనుంది. ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజాలకు ధీటుగా సరికొత్త దేశీయ ఈ-కామర్స్ సామ్రాజ్యాన్ని నెలకొల్పనున్నారు.
ఈ మేరకు అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు పూర్తి సొంత సబ్సిసిడరీని రూపొందిస్తూ ఆమోదం తెలిపింది. దీని కోసం సుమారు రూ.1.08 లక్షల కోట్లు (15బిలియన్ల డాలర్లు) మేర పెట్టుబడి పెట్టాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇదంతా రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ లిమిటెడ్ లో పెట్టుబడులుగా మార్చే అవకాశం ఉంది.
ఈ సబ్సిడరీ ద్వారా ఆర్ఐఎల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ నుంచి సుమారు రూ.65 వేల కోట్లు సేకరించనున్నారు. జియోలో ఇదివరకే మూలధనం రూ.65వేల కోట్లు ఉండగా, దాదాపు మార్చి 2020 నాటికి అప్పుల భారం తగ్గించుకోనున్నట్టు పేరంట్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసియాలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన ముఖేశ్ అంబానీ తాజాగా ఆయిల్-టూ పెట్రో కెమికల్స్ గ్రూపు పైవోట్ తో డేటా, డిజిటల్ సర్వీసుల అభివృద్ధిపై ఒప్పందం చేసుకున్నారు.
ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్.కమ్ ఇంక్, వాల్ మార్ట్ ఇంక్, ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ సర్వీసెస్ ప్రైవేట్.ఇన్ ఇండియా వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫాంలకు పోటీగా ఆన్ లైన్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేసే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







