రేపట్నుంచి బహ్రెయిన్‌లో కొత్త పెట్రోల్ ధరలు
- January 11, 2016
క్యాబినెట్ పెట్రోల్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సూచన మేరకు క్యాబినెట్, పరిస్థితిని సమీక్షించింది. నేషనల్ ఆయిల్ మరియు గ్యాస్ అథారిటీ (ఎన్ఓజిఎ) ఈ మేరకు క్యాబినెట్‌కు ఓ నివేఇక అందించింది. సవరించిన ధరలు ఇలా ఉన్నాయి. 95 ఆక్టేన్ పెట్రోల్ ధర 160 ఫిల్స్, 91 ఆక్టేన్ పెట్రోల్ ధర 125 ఫిల్స్. జనవరి 12 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ ధరల సవరణ సమీప భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని ఎనర్జీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ హుస్సేన్ బిన్ అలి మీర్జా చెప్పారు. అంతర్జాతీయంగా చమురు ధరల పతనంతో ఆర్థిక సంక్షోభం తలెత్తిందనీ, ఆర్థిక లోటును పూడ్చుకునేందుకే ఈ చర్యలు చేపట్టాల్ని వచ్చిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







