నేడే జల్లికట్టు నిషేధం పై దాఖలైన పిటిషన్ విచారణ
- January 12, 2016
జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. కేంద్ర ప్రభుత్వం జల్లికట్టు నిర్వహణపై ఉన్న నిషేధాన్ని ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సంప్రదాయం పేరుతో మూగ జీవాలను హింసించడం జంతు సంరక్షణ చట్టం ప్రకారం నేరమని పిటిషన్లో పేర్కొన్నాయి. తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా జల్లికట్టును నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పండుగకు సమయం ఎక్కువగా లేనందున దీనిపై త్వరగా విచారణ చేపట్టాల్సిందిగా భారత జంతు సంరక్షణ బోర్డు, పెటా, బెంగళూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిన్న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను స్వీకరించి... మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







