పెళ్లి కి సై అన్నకాజల్..!
- May 17, 2015
టాలీవుడ్ 'మిత్రబింద' కాజల్ అగర్వాల్ వచ్చే ఏడాది పెళ్లిపీటలెక్కబోతోందట!. నిన్న, మెన్నటి వరకు పెళ్లెప్పుడు? అంటే... ''నాకన్నా సీనియర్లు ఎందరో ఉన్నారు. వారందరికీ కానీయండి. అప్పుడు ఆలోచిస్తాను.'' అంటూ తప్పించుకుంటూ వచ్చింది కాజల్. అయితే పెళ్లి విషయంలో ఆమె తప్పించుకుంటున్నా.. ఆమె కుటుంబం మాత్రం ఒప్పుకోవడం లేదు. కాజల్ చెల్లెలు నిషా ఇప్పటికే పెళ్లి చేసుకొని స్థిరపడిపోయింది. అందుకే కాజల్‌ను కూడా పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒత్తిడి తెస్తున్నారట. ఆ కారణంగా కాజల్ పెద్దగా సినిమాలు కూడా అంగీకరించడం లేదని తెలిసింది. సినిమాలు అంగీకరించకపోవడంపై ఏవో కహానీలు చెబుతున్నా.. దానికి అసలు కారణం పెళ్లి ఆలోచనేనట! చేతిలో ఉన్న సినిమాలు త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం నాటికి పెళ్లి పీటలు ఎక్కుతానని కాజల్ ఇంట్లో చెప్పిందట. పెళ్లికి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె కుంటుంబ సభ్యులు ప్రస్తుతం వరుడి వేటలో ఉన్నారట!
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







