పావ్ భాజీ పలావ్..
- May 17, 2015
కావలసిన పదార్ధాలు:
- బాస్మతి బియ్యం - 1/2 కిలో
- ఉల్లిపాయలు - 2
- టమాటోలు - 2
- కాలిఫ్లవర్ ముక్కలు - 1 కప్పు
- కారట్ - 2
- బీన్స్ ముక్కలు - 1/2 కప్పు
- పావ్ భాజీ మసాల - 2 టేబుల్ స్పూన్లు
- పచ్చికారం - 2 టీ స్పూన్లు
- ఉప్పు - తగినంత
- కొత్తిమీర - కట్ట
- నిమ్మకాయ - 1
- పావ్ / బర్గర్ బన్ - 1
- వెన్న - 100 గ్రా.
- అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టేబుల్ స్పూను
చేయు విధానం:
- బీన్స్, కారట్, కాలిఫ్లవర్ ముక్కల్లో తగినన్ని నీళ్ళు పోసి కాస్త ఉడికించాలి.
- అన్నం కాస్త పలుకు ఉండేలా వండాలి.
- బాణీలో సగం వెన్న వేసి సగం ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి, టమాటో ముక్కలు వేసి వేయించాలి. తరవాత కాస్త ఉడికించిన కూరగాయముక్కలు, పావ్ భాజీ మసాలా, కారం, ఉప్పు వేసి కలపాలి.
- మందపాటి బాణీలో ఉడికించిన అన్నం అడుగున పేర్చి, ఉడికించిన పావ్ భాజీ మసాల చల్లినట్లుగా వేసి, దానిమీద మిగిలిన అన్నం వేయాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు, మిగిలిన వెన్న కూడా వేసి పది నిమిషాలు దమ్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర తురుము చల్లి వడ్డించాలి.
--- వై.రచన, హైదరాబాద్.
తాజా వార్తలు
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు







