నేడు బ్రహ్మానందం చేతుల మీదుగా 'బిర్యానీస్‌ అండ్‌ మోర్‌' రెస్టారెంట్‌ ప్రారంభం

- October 31, 2019 , by Maagulf
నేడు బ్రహ్మానందం చేతుల మీదుగా 'బిర్యానీస్‌ అండ్‌ మోర్‌' రెస్టారెంట్‌ ప్రారంభం

 

దుబాయ్:ప్రముఖ సినీ హాస్యనటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ బ్రహ్మానందం, దుబాయ్‌లో బిర్యానీస్‌ అండ్‌ మోర్‌ బ్రాంచ్‌ని ప్రారంభిస్తున్నారు. అక్టోబర్‌ 31న సాయంం 6 గంటలకు ఈ రెస్టారెంట్‌ ప్రారంభమవుతుంది. దుబాయ్‌లోని అల్‌ నహ్దా 1 ప్రాంతంలో, ఇఎన్‌ఓసి పెట్రోల్‌ స్టేషన్‌ సమీపంలో హాబ్‌టూర్‌ బిల్డింగ్‌లో ఈ బిర్యానీస్‌ అండ్‌ మోర్‌ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేశారు. ఒకేసారి 100 మంది సౌకర్యంగా కూర్చునేందుకు వీలుగా రెస్టారెంట్‌ని తీర్చిదిద్దామని ఫ్రాంఛైజీ ఓనర్‌ రషీద్‌ మొహమ్మదాలి చెప్పారు. తమకు ఇండియా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మరియు యూఏఈలో పలు చెయిన్స్‌ ఆఫ్‌ రెస్టారెంట్స్‌ వున్నాయని ఆయన వివరించారు. దుబాయ్‌లో కొత్తగా ఓపెన్‌ చేస్తోన్న రెస్టారెంట్‌లో 200కి పైగా డిషెస్‌ ఆహార ప్రియుల కోసం అందుబాటులో వుంటాయని తెలిపారాయన. నాన్‌ వెజ్‌తోపాటు వెజిటేరియన్‌ బిర్యానీలోనూ అనేక రకాలు అందుబాటులో వుంటాయి. ఒక్క నాన్‌ వెజ్‌ విభాగంలోనే 20కి పైగా వెరైటీలు తమ వద్ద లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కేటరింగ్‌ సౌకర్యం అలాగే యాంపిల్‌ పార్కింగ్‌ స్పేస్‌, చిన్న చిన్న పార్టీలూ.. వంటి ప్రత్యేకతలు తమ సొంతమని నిర్వాహకులు వివరించారు. మరిన్ని వివరాలకు www.biryanis.com

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com