వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ప్రై. లిమిటెడ్ డైరెక్టర్ క్రాంతి మార్క్ తో ముఖాముఖి
- November 01, 2019ప్ర) వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ గురించి చెప్పండి?
జ) వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ప్రై లిమిటెడ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్. SEBI తో గుర్తింపు పొందినటువంటి సెక్యూరిటీస్ మార్కెట్ సంస్థ. మా సంస్థలో ప్రధానంగా ఎన్.ఆర్.ఐ లకు మరియు పి.ఓ.ఐ (person of Indian origin) లకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మరియు లాంగ్ టర్మ్ లో సంపదను సృష్టించేందుకు తోడ్పాటునిస్తుంది.
ప్ర) ఈ రంగం పట్ల మీకు ఎలా ఆసక్తి ఏర్పడింది?
జ) నాకు చిన్నతనం నుంచి స్టాక్ మార్కెట్లు అంటే ఆసక్తి ఉండేది కానీ అంత మార్కెట్ అవగాహన లేదు కానీ నా చదువు పూర్తయిన తరువాత స్టాక్ మార్కెట్ మీద అధ్యయనం చేయటం ప్రారంభించాను. గత 20 సంవత్సరాలలో నేను చేసిన ఉద్యోగాలు అన్నింటిని స్టాక్ మార్కెట్ రంగంలో ఎంచుకున్నాను. ఆ అనుభవంతో ఇన్వెస్టర్లకు లాంగ్ టర్మ్ లో ఉపయోగంగా ఉండటానికి 2015 లో వెల్త్ మిల్స్ సెక్యూటిరీస్ ని ప్రారంభించడం జరిగింది.
ప్ర) స్టాక్ మార్కెట్ అనగానే చాల అపోహలు చాల మందిలో ఉంటాయి. మరి మీరేమంటారు?
జ) స్టాక్ మార్కెట్లు అంటే చాలామందికి అపోహలు ఉంటాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడూ అనిస్థితిగా ఉంటుంది మరియు స్టాక్ ధరలు ఒడిదుడుకులకు లోనవుతాయి. అత్యధిక శాతం మంది ఇన్వెస్టర్లు ఈ ఒడిదుడుకులను ఇష్టపడరు. ఇందువలన అపోహలకు అవకాశం ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్ అంటే మనం చూస్తున్న మరియు అనుభవం గల కంపెనీల యొక్క వ్యాపారం లో ఇన్వెస్ట్ చేయడం. మనము మంచి వ్యాపారం ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా, ఈ కంపెనీల యొక్క లాభాలు పెరిగిన కొద్దీ, స్టాక్ ధరలు బాగా పెరుగుతాయి. స్టాక్ పెట్టుబడులు ని వ్యాపారం పెట్టుబడులు గా పరిగణించినప్పుడు మిగిలిన అస్సేట్ల తో పోలిక చేస్తూ స్టాక్ మార్కెట్ల నుంచి మంచి లాభాలను సమకూర్చుతాయి.
ప్ర) మీ సంస్థ నుంచి ఎలాంటి సేవల్ని అందిస్తున్నారు?
జ) వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ లో మేము వెల్త్ మేనేజ్మెంట్ సేవలను పెట్టుబడిదారుల యొక్క దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా సేవలను అందిస్తాము.
ప్ర)ఎన్.ఆర్.ఐ లకు ప్రత్యేకంగా మీ సంస్థ అందించే సేవలు ఎలా ఉంటాయి?
జ) వెల్త్ మిల్స్ లో మా యొక్క ప్రత్యేకత ప్రపంచదేశాలతో ఉన్న ఎన్.ఆర్.ఐ లకు, అభివృద్ధి చెందుతున్న భారత దేశంలోని కంపెనీలలో ఇన్వెస్ట్ చేయటానికి సలహాలను మరియు కావాల్సిన DMAT మరియు ట్రేడింగ్ అకౌంట్ల సౌకర్యాలను సమకూర్చుతున్నాము.
ప్ర) కొత్తగా ఈ రంగంలోకి వస్తున్నవారికి మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా?
జ) కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవారు ఆర్ధిక వ్యవస్థల మీద అవగాహన మరియు కంపెనీల యొక్క వ్యాపార మోడళ్ల మీద అవగాహన పెంచుకోవాలి. స్టాక్ మార్కెట్ల మీద వచ్చే వడిదుడుకులను ఎదుర్కోటానికి లాంగ్ టర్మ్ ప్రక్రియని అలవాటు చేసుకుంటే ఈ రంగంలో తప్పకుండా రాణించవచ్చును.
ప్ర) స్టాక్ మార్కెట్ కి సంభందించి లాభ నష్టాల గురించి చెప్పండి?
జ) ఇన్వెస్టర్ల మంచి కంపెనీలలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మరియు ఆ కంపెనీల యొక్క లాభాలు లాంగ్ టర్మ్ లో తప్పకుండా పెరుగుతాయి.తద్వారా కంపెనీల యొక్క షేర్ ధరలలో ఘననీయంగా పెరిగే అవకాశాలు ఉంటాయి.
ప్ర) మానసిక ఒత్తిళ్లకు ఈ స్టాక్ మార్కెట్ వ్యవహారాలే కారణమని అంటుంటారు అది వాస్తమేనా?
జ) మార్కెట్లో షార్ టర్మ్ లో అవగాహన లేకుండా ఊహాగానాలు చేయడం మరియు అధికంగా ‘ఫ్యూచర్స్ & ఆప్షన్స్’ మార్కెట్ల సెగ్మెంట్ లో ఊహాగానాలు చేయడం వలన నష్టాలను చవిచూసే అవకాశాలు ఎక్కువ. అందువలన పెట్టుబడిదారులు షార్ట్ టర్మ్ ఊహాగానాలు మరియు ఉత్పన్న మార్కెట్లలో అవగాహనతో ట్రేడ్ చేయాలి లేదా ఊహాగానాలు మార్కెట్ సెగ్మెంట్ల లోకి రాకూడదు.
ప్ర) అంచెలంచెలుగా ఈ రంగంలో ఎదిగిన మీ ప్రస్థానంలో మీరెదుర్కున్న సవాళ్లు ఎలాంటివి?
స్టాక్ మార్కెట్లను నిర్వహించే సంస్థను నెలకొల్పడంలో అనేక సవాళ్లు ఉంటాయి. అనేక రేగులటరీ బాడీల నుంచి అనుమతి పొందడం మరియు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కంపెనీలను సెలెక్ట్ చేసి వెల్త్ మిల్స్ ను ఇన్వెస్టర్లకు చేరువ చేయడం ఈ రంగంలో ఒక సవాలు లాంటిదే.
ప్ర) స్టాక్ మార్కెట్ అంటే అదొక జూదం అనేవారికి మీరు ఏం సంధానమిస్తారు?
స్టాక్ మార్కెట్ లో అనేక రకాల మార్కెట్ సెగ్మెంట్లు ఉంటాయి. అందులో ప్రధానమైనది క్యాష్ మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం కొంతవరకు అత్యంత రిస్క్ తో కూడుకున్నది మరియు పెట్టిన పెట్టుబడులను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు అనేక అపోహలకు దోహదపడుతాయి. కానీ లాంగ్ టర్మ్ లో కంపెనీలలో ఒక నిర్దేశిత పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేయడం వలన మిగిలిన ఆస్తులతో పోల్చినట్లయితే స్టాక్ మార్కెట్ లో మెరుగైన మరియు అత్యధిక సంపదను ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ లో క్రియేట్ చేయవచ్చును.
తాజా వార్తలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్