వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నేడు సీబీఐ కోర్టు తుది తీర్పు
- November 01, 2019
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పెట్టుకున్న అభ్యర్థనపై నేడు సీబీఐ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. సీబీఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు ముగిశాయి. ప్రతీ శుక్రవారం విచారణకు తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతివ్వాలని జగన్ అప్పీల్ చేసుకున్నారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. విజయవాడ నుంచి హైదరాబాద్లోని కోర్టుకు హాజరు కావడానికి సుమారు రెండు రోజులు పడుతోందన్నారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తాను ఎక్కువ సమయం ఏపీలోనే కేటాయించాల్సి ఉందన్నారు. మరోవైపు జగన్ అభ్యర్థనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేసు విచారణకు తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇప్పుడు సీఎం జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే కేసు విచారణ మరింత ఆలస్యం అవుతుందని వాదించింది సీబీఐ. సీఎం జగన్ రాజకీయ, ధన, అర్ధ, అంగ బలంతో సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, సీఎం అయినంత మాత్రాన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ బలంగా వాదనలు వినిపించింది. గతంలో ఇదే అభ్యర్థనపై జగన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసినందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు నేడు తుది తీర్పును వెల్లడించనుంది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







