అండర్-18 ఫుట్‌బాల్ ఈవెంట్‌కి ఆతిథ్యమివ్వనున్న బహ్రెయిన్
- November 01, 2019
బహ్రెయిన్, రెండో ఎడిషన్ వెస్ట్ ఏసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (డబ్ల్యుఎఎఫ్‌ఎఫ్) అండర్ 18 గర్ల్స్ ఛాంపియన్ షిప్‌కి ఆతిథ్యమివ్వనున్నట్లు బహ్రెయిన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (బిఎఫ్‌ఎ) వెల్లడించింది. బిఎఫ్‌ఎ మరియు డబ్ల్యుఎఎఫ్‌ఎఫ్ మధ్య ఒప్పందం నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. డిసెంబర్ 29 నుంచి జనరవరి 6 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ముహర్రాక్ క్లబ్‌లోని షేక్ అలి బిన్ మొహమ్మద్ బిన్ ఇసా అల్ ఖలీఫా స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఏడు టీమ్‌లు ఈ పోటీల్లో తలపడ్తాయి. డిఫెండింగ్ ఛాంపియన్ జోర్డాన్, యూఏఈ, లెబనాన్, ఇరాక్ పాలస్తీనా, కువైట్ మరియు బహ్రెయిన్ టీమ్‌లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మొత్తం టీమ్‌లు రెండు గ్రూపులుగా డివైడ్ చేయబడ్తాయి. ఆ గ్రూపుల్లో టాప్‌గా నిలిచిన రెండు టాప్ టీమ్‌స నాక్‌ఔట్ సెమీ ఫైనల్స్‌కి చేరుకుంటాయి.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







