ఒమన్ - ఇండియా మధ్య ఆల్టర్నేటివ్ ఎయిర్ రూట్స్
- November 02, 2019
మస్కట్: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, క్యార్ తుపాను ప్రభావంతో ఎయిర్ ట్రాఫిక్‌కి సంబంధించి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రూట్స్‌ని సమర్థవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇండియా - ఒమన్ మధ్య. మస్కట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, టెంపరరీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్రొసిడ్యూర్స్‌తో, విమానాల రూటు విషయంలో క్యార్ ప్రభావాన్ని తగ్గించగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియా - ఒమన్ మధ్య రెగ్యులర్ రూట్స్ స్థానంలో ప్రత్యామ్నాయ రూట్స్‌ని డిజైన్ చేసి, సమర్థవంతంగా క్యార్ తుపాను ప్రభావం పడకుండా చేయగలిగినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఎమర్జన్సీ టీమ్ సంయుక్తంగా ఈ ప్రణాళికను అమలు చేశాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







