మహిళల్ని అసభ్యకరంగా ఫొటోలు తీస్తున్న వ్యక్తి అరెస్ట్
- November 05, 2019
కువైట్ సిటీ: పబ్లిక్ ప్రాంతాల్లో మహిళల్ని చాటు మాటుగా గమనిస్తూ, వారి ఫొటోల్ని అసభ్యకరంగా తీస్తోన్న వ్యక్తిని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, నిందితుడ్ని అత్యంత చాకచక్యంగా గుర్తించగలిగింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు, నిందుతుడ్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అతి తక్కవ సమయంలోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు మహిళల్ని చాటుమాటుగా గమనిస్తూ, వారి ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఓ కువైటీ మహిళ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







