ఎయిర్ ఏషియా బంపరాఫర్
- November 05, 2019
ఎయిర్ ఏషియా ఆదివారం నాడు బంపరాఫర్ ప్రకటించింది. నవంబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 6 మిలియన్ల ప్రమోషనల్ సీట్లు అందుబాటులో ఉంటాయని, వాటిని మంచి ఆఫర్ పైన కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. ఎయిర్ ఏషియా తాజా ఆఫర్ కింద విమాన టిక్కెట్ ధరను రూ.1,019గా నిర్ణయించింది. అంతర్జాతీయ రూట్లలో రూ.2,399గా నిర్ణయించింది.
ఎయిర్ ఏషియా బిగ్ మెంబర్స్, బిగ్ పే యూజర్లు, ఎయిర్ ఏషియా క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఇది నవంబర్ 3వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇతరులకు ఈ నెల 4 నుంచి 10 వరకు టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చునని సూచించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీ నుంచి మార్చి 1, 2021 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని తెలిపింది. వ్యాల్యూ ప్యాక్ పైన కూడా మరో 20 శాతం ఆదా చేయవచ్చునని తెలిపింది. వ్యాల్యూ ప్యాక్‌లో మీల్, సీట్ సెలక్షన్, ఇన్సురెన్స్, 20 కిలోల బ్యాగేజ్ అలవెన్స్ ఉంటుంది.
ఈ సందర్భంగా కంపెనీ సీవోవో సంజయ్ కుమార్ మాట్లాడారు. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలిపారు. హాలీడే, ఫెస్టివెల్ సీజన్లో ప్రయాణించేవారు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం వల్ల ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!