షార్జా:ప్రమాదంలో భారత మహిళ మృతి

- November 05, 2019 , by Maagulf
షార్జా:ప్రమాదంలో భారత మహిళ మృతి

 షార్జా:దురదృష్టవశాత్తూ భారత మహిళ ఒకరు షార్జాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. టీనేజర్‌ అయిన తన కుమారుడి కారణంగానే ఆమె మృతి చెందడం మరింత బాధాకరం. కువైలాహ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ కారుని పార్క్‌ చేసే సమయంలో బ్రేక్‌ వేయాల్సింది పోయి, 17 ఏళ్ళ టీనేజర్‌, యాక్సెలరేటర్‌ బలంగా నొక్కడంతో ఆ కారు ముందున్న మహిళపైకి కారు దూసుకుపోయింది. ఆ ఘటన సమయంలో ఆమె పార్క్‌ బయట కూర్చుని వున్నారు. ఈ కేసుకి సంబంధించి టీనేజర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పెట్రోల్‌ ఆఫీసర్స్‌, అంబులెన్స్‌ టీమ్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె మృతిని ధృవీకరించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com