పావ్ భాజీ పలావ్..

- May 17, 2015 , by Maagulf
పావ్ భాజీ పలావ్..

కావలసిన పదార్ధాలు:

  • బాస్మతి బియ్యం         - 1/2 కిలో
  • ఉల్లిపాయలు              - 2
  • టమాటోలు               - 2
  • కాలిఫ్లవర్ ముక్కలు      - 1 కప్పు
  • కారట్                       - 2
  • బీన్స్ ముక్కలు          - 1/2 కప్పు
  • పావ్ భాజీ మసాల        - 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చికారం                  - 2 టీ స్పూన్లు
  • ఉప్పు                       - తగినంత
  • కొత్తిమీర                   - కట్ట
  • నిమ్మకాయ                - 1
  • పావ్ / బర్గర్ బన్        - 1
  • వెన్న                       - 100 గ్రా.
  • అల్లం వెల్లుల్లి ముద్ద      - 1 టేబుల్ స్పూను

 

చేయు విధానం:

  • బీన్స్, కారట్, కాలిఫ్లవర్ ముక్కల్లో తగినన్ని నీళ్ళు పోసి కాస్త ఉడికించాలి.
  • అన్నం కాస్త పలుకు ఉండేలా వండాలి.
  • బాణీలో సగం వెన్న వేసి సగం ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి, టమాటో ముక్కలు వేసి వేయించాలి. తరవాత కాస్త ఉడికించిన కూరగాయముక్కలు, పావ్ భాజీ మసాలా, కారం, ఉప్పు వేసి కలపాలి.
  • మందపాటి బాణీలో ఉడికించిన అన్నం అడుగున పేర్చి, ఉడికించిన పావ్ భాజీ మసాల చల్లినట్లుగా వేసి, దానిమీద మిగిలిన అన్నం వేయాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు, మిగిలిన వెన్న కూడా వేసి పది నిమిషాలు దమ్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర తురుము చల్లి వడ్డించాలి.

 

                                                                          --- వై.రచన, హైదరాబాద్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com