మరోసారి యూఏఈ ప్రెసిడెంట్‌గా షేక్‌ ఖలీఫా ఎన్నిక

- November 07, 2019 , by Maagulf
మరోసారి యూఏఈ ప్రెసిడెంట్‌గా షేక్‌ ఖలీఫా ఎన్నిక

షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మరోమారు యూఏఈ ప్రెసిడెంట్‌గా సుప్రీం కౌన్సిల్‌ ద్వారా ఎన్నికయ్యారు. తొలిసారిగా 2004 అక్టోబర్‌ 3న షేక్‌ ఖలీఫా ప్రెసిడెంట్‌ పదవికి ఎంపికయ్యారు. ఆయన ప్రెసిడెంట్‌గా ఎంపికవడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా నేతృత్వంలో యూఏఈ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.యూఏఈ ఫౌండర్‌ షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌తో కలిసి యూఏఈ అభివృద్ధికి ఎంతో శ్రమించారు. దేశానికి సమర్థ నాయకత్వం అందించేందుకు తనవంతు కృషి చేశారు. యూఏఈ ఫౌండింగ్‌ ఫాదర్‌ మృతి తర్వాత తానే నాయకత్వాన్ని అందుకుని, యూఏఈని మరింత ముందుకు నడిపారు. ప్రపంచ వ్యాప్తంగా యూఏఈకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు షేక్‌ ఖలీఫా.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com