కార్‌ ఫ్రాడ్‌: ఇద్దరి అరెస్ట్‌

- November 07, 2019 , by Maagulf
కార్‌ ఫ్రాడ్‌: ఇద్దరి అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ఇద్దరు వ్యక్తుల్ని వెహికిల్‌ రిలేటెడ్‌ నేరాలకు సంబంధించి అరెస్ట్‌ చేయడం జరిగింది. ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ఓ ప్రకటన విడుదల చేసింది. నార్త్‌ అల్‌ బతినా పోలీస్‌ కమాండ్‌ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసిందనీ, డ్రిఫ్టింగ్‌కి పాల్పడుతున్న నేరంతోపాటుగా, ఇతరుల కార్లకు చెందిన నెంబర్‌ ప్లేట్లను దొంగిలించి వాటిల్లో ఒకదాన్ని తమ కారుకి వాడినట్లు కూడా అభియోగాలు మోపినట్లు ఆ ప్రకటనలో తెలిపారు అధికారులు. నెంబర్‌ ప్లేట్‌ మార్చి, కేసు తప్పుదోవ పట్టించినట్లు కూడా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com