ఆర్టీసీ ఎండీ సునీల్‌పై హైకోర్టు సీరియస్
- November 07, 2019
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ... చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయని.. తాము వేటిని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరణనిస్తూ.. 2-6-2014 నుంచి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను మీకు అందించిన తాజా నివేదికలో పొందుపరిచామన్నారు. కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి వివరాలతో మీకు అందించామని హైకోర్టుకు తెలిపారు. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు.. పదాలు వాడారని హైకోర్టు పేర్కొంది. అధికారుల నివేదికపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. రుణ పద్దుల కింద కేటాయించిన నిధులు అప్పు కాదని, గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని.. హైకోర్టు ఇంతవరకు ఏ బడ్జెట్‌లో అలా చూడలేదని పేర్కొంది. అయితే సీజే అడిగిన ప్రతి ప్రశ్నకి నివేదిక ఆధారంగా రామకృష్ణారావు లెక్కలు చూపిస్తూ సమాధానం చెబుతున్నారు.
మంత్రికి సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని... ఆయనకు తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లేనని హైకోర్టు పేర్కొంది. కేబినెట్‌కి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని... సీఎంకి సైతం తప్పుడు లెక్కలతో స్టేట్‌మెంట్ ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హైకోర్టు మండిపడింది.
అంతకు ముందే ఏం జరిగిందంటే: ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం తప్పుపట్టింది. ఐఏఎస్ అధికారులే హైకోర్టుకు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా? అని ప్రశ్నించింది. రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించే నివేదిక ఇస్తున్నామని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. అలాగైతే మొదటి నివేదిక పరిశీలించాకుండానే ఇచ్చారా? అని ధర్మాసనం నిలదీసింది. తక్కువ సమయంలో తమ కార్యాలయంలో ఉన్న రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని తమను క్షమించాలని రామకృష్ణారావు కోరారు. క్షమాపణ కోరడం సమాధానం కాదని కోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టులకు వాస్తవాలు చెప్పాలని హెచ్చరించింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







