అన్ని తీర్థయాత్రలకు ఒకటే ట్రైన్: భారత్ దర్శన్

- November 07, 2019 , by Maagulf
అన్ని తీర్థయాత్రలకు ఒకటే ట్రైన్: భారత్ దర్శన్

నగర ప్రాంత పర్యాటకుల కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ మరో విన్నూత ఆలోచనతో ముందుకొచ్చింది. 'భారత్ దర్శన్' అనే ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను, పర్యాటక స్థలాలను సందర్శించేందుకు అనుగుణంగా ఈ ఆర్ధిక సంవత్సరంలోనే అందుబాటులోకి రానున్నారు. ఈ రైలు ముందుగా జనవరిలో ప్రారంభించి దక్షిణ భారత దేశంలోని పుణ్య క్షేత్రాల పర్యటనలో వాడతారు.

ఆ తర్వాత దేశ వ్యాప్తంగా వున్న అన్ని పుణ్య క్షేత్రాలకు, పర్యాటక స్ధలాలకు దశాల వారీగా ఏర్పాటు చేయనున్నారు. ఈ రైలు ప్యాకేజీల నిర్వహణ బాధ్యత ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో ఉంటుంది. నగర వాసుల అభిరుచికి తగ్గినట్టుగా, వివిధ ప్రాంతాల వాతావరణానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయన్నుట్లు ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు.

హైదరాబద్ నుంచి ప్రతి సంవత్సరం 50 వేల మందికి పైగా ఉత్తర, దక్షిణ భారత దేశ పుణ్య క్షేత్రాలకు, పర్యాట ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ ప్రాంతాలను దర్శించటానికి వెళ్లాంటే రెండు, మూడు రైళ్ళు మారాల్సిన పరిస్ధితి ఉంటుంది. దీంతో కుటుంబాలతో కలిసి ,అధిక లగేజీతో రైలు మారాలంటే పడుతున్న తంటాలు తగ్గిపోతాయి. ఇకపై ప్రైవేట్ టూరిస్ట్ ట్రావెల్స్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఈ విధంగా దక్షిణ మధ్య రైల్వే పర్యాటక రైలు అందుబాటులోకి రావడంతో ప్రజల ఇబ్బందులు తొలిగినట్లేనని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com