ప్యారాచూట్స్ ప్రమాదం: ఆరుగురికి గాయాలు
- November 11, 2019
యూఏఈ: ఆసియాకి చెందిన ఆరుగురు వ్యక్తులు తమ ప్యారాచూట్స్లో ఏర్పడ్డ సాంకేతిక సమస్య కారణంగా గాయపడ్డారు. భారీ వర్షాలు, అతి వేగంగా వీచిన గాలులతో సమస్య ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. మూడు ప్యారాచూట్స్లో బాధితులు పారాసెయిలింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షార్జా ఖోర్ ఫక్కన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరిలో ఓ వ్యక్తి సమీపంలోని ఫామ్‌లో ల్యాండ్ అవగా, మరో వ్యక్తి షాపింగ్ సెంటర్ దగ్గర రోడ్డుపై ల్యాండ్ అయ్యారు. మిగతా నలుగురు ఎక్కడ క్రాష్ అయ్యారన్న వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు. ఈ ప్రమాదాన్ని అటుగా రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి ఫోన్లో చిత్రీకరించడం జరిగింది. కాగా, ముగ్గురు వ్యక్తులకు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. మరో ముగ్గురికి వైద్య చికిత్స అందుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..