ద్విచక్రవాహనాలకు ఏకీకృత నిభందనలు

- January 12, 2016 , by Maagulf
ద్విచక్రవాహనాలకు ఏకీకృత నిభందనలు

గల్ఫ్ దేశాల సమాఖ్యలొ ద్విచక్రవాహనాలకు ఏకీకృత నిభందనలు, శాశ్వత మార్గదర్శకాలు ఇకపై రూపొందుతున్నాయి. ఇవి ఏప్రిల్ నుంచి సమర్దవంతంగా అమలు కానున్నట్లు పారిశ్రామిక , వాణిజ్య మొన అల్ అలవి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం గల్ఫ్ దేశాల సమాఖ్య రాష్ట్రాలలో ద్విచక్రవాహనాలను తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక  వారికిష్టమైన రీతులలో కొనసాగించడానికి వీలు లేదు. వివిధ మోడల్ మోటార్ బైకులను పలు రకాలైన టైర్లతో రూపొందించడంలో ప్రామాణికాలను, కొలతల గూర్చి గల్ఫ్ దేశాల సమాఖ్య అనుకూలిత ద్రువీకరణ పొందాల్సి ఉంటుంది. గతంలో, ఇదే తరహ ప్రయోగాన్ని కార్లు , కార్గో ట్రక్కులు , టైర్ల ఉత్పతులు భద్రత భరోసా విషయమై 2005 లో  చేసి భారీ విజయాన్ని సాధించడం జరిగింది. ఇదే విధానాన్ని ద్విచక్రవాహనదారులకు ఈ ఏకీకృత నిబంధనలు అమలులోనికి రానున్నాయి. గల్ఫ్ దేశాల సమాఖ్య రాష్ట్రాలలో వారికి ఇచ్చే అనుకూలత సర్టిఫికేట్ ఆమోదయోగ్యంగా ఉంటుంది. భద్రత , అనుకూలత నిర్ధారణ లేని ద్విచక్రవాహనాలను ఎగుమతి చేయకుండా నివారించేందుకు ఈ చర్య ఎంతగానోఉపయోగపడుతుంది. గల్ఫ్ దేశాల సమాఖ్య సాంకేతిక నిబంధనలు తయారీదారుల ఆచరణకు  వీలుగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com