గురుద్వారా సందర్శన సందర్భంగా..రోటీలు తయారు చేసిన ప్రిన్స్ ఛార్లెస్
- November 14, 2019

దిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ బుధవారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లోని ఔషధీవనంలో ప్రిన్స్ ఛార్లెస్ మొక్కను నాటారు. అనంతరం గురుద్వారా బంగ్లా సాహిబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా దిల్లీ సిక్కు మేనేజ్మెంట్ కమిటీ ఆయనకు ఘనస్వాగతం పలికింది. అనంతరం అక్కడి సిక్కులతో కలిసి ముచ్చటించారు. వారితో ఫొటోలు కూడా దిగారు. ప్రసాదం తయారీశాలకు వెళ్లి రోటీలు తయారు చేశారు. గురునానక్ 550వ జయంతి సమయంలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రిన్స్ ఛార్లెస్ అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రావడం ఇది పదోసారి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







