స్మార్ట్‌ ఫ్యాక్టరీలపై రియాద్‌ ఫోరంలో చర్చ

- November 15, 2019 , by Maagulf
స్మార్ట్‌ ఫ్యాక్టరీలపై రియాద్‌ ఫోరంలో చర్చ

రియాద్‌: ఇండస్ట్రీ మరియు మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగాల్లో వస్తున్న మార్పులపై రియాద్‌ ఫోరంలో కీలక చర్చ జరగనుంది. సౌదీ అథారిటీ ఫర్‌ ఇండస్ట్రియల్‌ సిటీస్‌ అండ్‌ టెక్నాలజీ జోన్స్‌ ఇన్‌ రియాద్‌ ఈ ఫోరమ్‌ని నిర్వహిస్తోంది. 19కి పైగా రీజినల్‌, అంతర్జాతీయ గ్రూప్‌లు ఈ వేదికపై 'స్మార్ట్‌ ఫ్యాక్టరీస్‌'కి సంబంధించి తమ అభిప్రాయాల్ని పంచుకోనున్నాయి. విజన్‌ 2030లో భాగంగా సౌదీ అరేబియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని 100 ఫ్యాక్టరీల్లో తొలుత ప్రవేశపెట్టనున్నారు. ఇండస్ట్రీ 4.0 రివల్యూషన్‌లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నామనీ, మొత్తం 100 ఫ్యాక్టరీల్లో 20 ఫ్యాక్టరీలు జనరల్‌ ఎలక్ట్రిక్‌ సహకారంతో ముందుకు వెళుతున్నాయనీ, మరో 80 ఫ్యాక్టరీలు త్వరలో లాంఛ్‌ అవుతాయని అథారిటీ మార్కెటింగ్‌ అండ్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ బందర్‌ అల్‌ తవోమి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com