"వన్ నేషన్-వన్ పే డే"
- November 16, 2019
దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి నెలా సకాలంలో ఓకే రోజు వేతనాలు అందించేందుకు సిద్ధమవుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం ఉద్దేశించిన చట్టాన్ని ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే తీసుకురాబోతున్నారు. అలాగే, కార్మికులకు మెరుగైన జీవితం గడిపేందుకు అన్ని రంగాల్లో ఒకే విధంగా కనీస వేతనాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ చెప్పారు. మోడీ సర్కారు 2014 నుంచే కార్మిక సంస్కరణలను ప్రారంభించిందన్న మంత్రి.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ 3వేల పింఛనుతో పాటు వైద్య బీమా అందించాలని నిర్ణమయించామని చెప్పారు.
రానున్న రోజుల్లో అసంఘటిత రంగ కార్మికులు, కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు మరిన్ని పథకాలు తీసుకురానున్నమని గాంగ్వర్ చెప్పారు. అధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న వాటిల్లో ప్రైవేట్ సెక్యూరిటీ పరిశ్రమ అతిపెద్దదన్నారు. ఇందులో 90 లక్షలు మంది పనిచేస్తున్నారని, త్వరలో ఈ సంఖ్య 2 కోట్లకు చేరే అవకాశముందని పేర్కొన్నారు మంత్రి.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







