టీటీడీ కీలక నిర్ణయం: డిపాజిట్లన్నీ ఆ బ్యాంకుల్లోనేట
- November 19, 2019
తిరుపతి: టీటీడీ పాలక మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకనుంచి ప్రాంతీయ బ్యాంకుల్లో కాకుండా జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా త్వరలోనే రూ.1500 కోట్లు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది.
టీటీడీ సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంపై పలువురు భక్తులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అంతేకాదు గతంలో రూ.1400 కోట్లను ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీటీడీ సొమ్మును జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని కోర్టు అభిప్రాయపడింది. దాంతో పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది.
దాంతో ఇకపై ఫిక్స్‌డ్ డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. రూ.5,000 కోట్ల వరకు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వెసులుబాటు ఉంది. అయిన్నప్పటికీ టీటీడీ బోర్డు కేవలం జాతీయ బ్యాంకులకు మాత్రమే పరిమితం కావాలని తాజాగా తమ నిర్ణయాన్ని ప్రకటించింది. జాతీయ బ్యాంకుల్లో ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.
అయినప్పటికీ జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం ద్వారా టీటీడీకి 100కోట్ల రూపాయల వరకు నష్టం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 8.6 శాతం వరకు వడ్డీని ఇస్తుంటే జాతీయ బ్యాంకులు కేవలం 6.5 నుండి 7 శాతం వరకు మాత్రమే వడ్డీని ఇస్తున్నాయి. పాలకమండలి నిర్ణయంతో రూ.1400 కోట్లు టీటీడీ సిండికేట్ బ్యాంకులో డిపాజిట్ చేసింది.
అధికారులకు వడ్డీ ఆదాయం తగ్గుముఖం పట్టడంతో బడ్జెట్ లోటును ఎలా భర్తీ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. టీటీడీ ఆర్థిక పరిస్థితిపై పాలక మండలి నిర్ణయం ప్రభావం చూపిస్తుందని ఆరోపిస్తోంది. ఇప్పటికే టీటీడీ పాలకమండలి వసతి గదుల రేట్లను పెంచే యోచనలో ఉందని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీని తగ్గించేలా పాలకమండలి నిర్ణయం తీసుకుంది.
టీటీడీ నిధులకు భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో జాతీయ బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకులో టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 25 శాతానికి మించి ఉన్నాయి. వడ్డీలపై సాధారణంగా రూ.840 కోట్లు టీటీడీకి ఆదాయంగా వస్తోంది. టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయంతో ఈ వడ్డీకి రూ.100కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయినప్పటికీ భక్తుల మనోభవాలు, హైకోర్టు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ...
తాజా వార్తలు
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!