స్కిల్స్‌ ఉంటే బ్యాన్‌ ఉండదు

- January 13, 2016 , by Maagulf
స్కిల్స్‌ ఉంటే బ్యాన్‌ ఉండదు

 
అబుదాబీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి (ఎబీఏ గ్రాడ్యుయేట్‌), పనిచేస్తున్న సంస్థ తనకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో, ఉద్యోగం విడిచిపెట్టాలనుకున్నాడు. దానికి చట్టం అనుమతిస్తుందా? అంటే, కొన్ని సందర్భాలు ఆ వ్యక్తికి అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. పనిచేస్తున్న సంస్థతో పరస్పర అవగాహన చేసుకుని, యజమాని - ఉద్యోగి మధ్య పరస్పర ఒప్పందం ద్వారా, ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చి వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు. కొత్త చట్టం దీనికి వెసులుబాటు కల్పించింది. అలాగే, ఆ సంస్థ జీతాలు చెల్లించలేని పరిస్థితిని ఉద్యోగి, మినిస్ట్రీ దృష్టికి తీసుకు వెళ్ళవచ్చు. అయితే ఇప్పటికి ఆ సంస్థ ఆ వ్యక్తికి జీతం ఇవ్వగలుగుతున్నందున, పరస్పర అవగాహనతో యజమాని - ఉద్యోగి ఒప్పందం చేసుకుని, ఆ కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకుని, వేరే ఉద్యోగం వైపు ఆ ఉద్యోగి దృష్టి సారించవచ్చు. ఉద్యోగికి ఉన్న స్కిల్స్‌ నేపథ్యంలో లెవల్‌1, లెవెల్‌ 2, లెవెల్‌ 3 ప్రకారం, స్కిల్స్‌ని బట్టి ఆరు నెలల బ్యాన్‌ ఎత్తివేయడం కూడా జరుగుతుంది. 

 

--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com