తెలంగాణకు ఇండియా టుడే అవార్డు

- November 23, 2019 , by Maagulf
తెలంగాణకు ఇండియా టుడే అవార్డు

హైదరాబాద్‌: "ఇండియాటుడే" దేశవ్యాప్తంగా నిర్వహించిన "స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ సర్వేలో మోస్ట్ ఇంప్రూవ్డ్ స్టేట్ ఇన్ గవర్నెన్స్- 2019" అవార్డుకు తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. ఈ అవార్డును శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపి కె.కెశవరావు అందుకున్నారు. ఈ సందర్భంగా కెకె మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్‌ కృషితో తెలంగాణ ప్రభుత్వం ర్రపజలకు ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తుందని చెప్పారు. నూతనంగా ఆవిర్భవించిన రాష్ట్రం అయినప్పటికీ పరిపాలన అంశంలో ప్రభుత్వం ప్రజలకు చేరువగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మంత్రం ఏమిటని ఇండియా టుడే సంస్థ ప్రతినిధులు అడగగా సిఎం కెసిఆర్‌ ప్రజలవద్దకు పాలనను తీసుకెళ్లి వారి సంక్షేమం, అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఎంపి కెకె చెప్పారు. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కష్టపడే తత్వం, నాయకత్వం, దృష్టి, స్పష్టత అని కెకె చెప్పారు. ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ కాన్ క్లేవ్ 2019 అవార్డును తెలంగాణ ప్రభుత్వానికి ప్రదానం చేసినందుకు రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ అవార్డును తీసుకున్న కెకెను కెటిఆర్ అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com