దుబాయ్: బిజినెస్ మీట్ కి ముఖ్యఅతిధిగా విచ్చేసిన టి.జి.వెంకటేష్
- November 23, 2019
దుబాయ్:దుబాయ్ లో గణేష్ రాయపూడి(ఇండెక్స్ LLC,దుబాయ్ మ్యానేజింగ్ డైరెక్టర్) ఆధ్వర్యంలో బిజినెస్ మీట్ కి ముఖ్యఅతిధిగా టి.జి వెంకటేష్(రాజ్యసభ ఎం.పి మరియు జాతీయ రవాణా, పర్యాటక, సాంస్కృతిక విభాగాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్) విచ్చేసారు.టి.జి వెంకటేష్ వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త. 1999 నుండి 2004 వరకు మరియు 2009 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసనసభ (ఎమ్మెల్యే) సభ్యుడిగా పనిచేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. 2016 నుండి రాజ్యసభ సభ్యుడు గా కొనసాగుతున్నారు.
ఈ కార్యక్రమం లో యూ.ఏ.ఈ లోని పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.జి వెంకటేష్ మాట్లాడుతూ భారత దేశంలో వ్యాపారాలకు ఉన్న అవకాశాలు పై వివరించారు.
ప్రముఖ సోషల్ వర్కర్గా ..40 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించిన ఉమా పద్మనాభన్ (ఉమా ప్యాడీ) ను సత్కరించారు.గణేష్ రాయపూడి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం తదనంతరం విందు ఏర్పాటు చేసారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..