మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సుప్రీం హీరో
- November 25, 2019
సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఈ పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తమన్, సాయి తేజ్ ఫ్రెండ్ షిప్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎంతో ఇష్టమైన తన ఫ్రెండ్ తమన్ కు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ తో నిజంగానే సర్ ప్రైజ్ చేసాడు సాయి తేజ్. తమన్ మ్యూజిక్ టేస్ట్ కి తగ్గట్టుగా పెర్ల్ మాలెట్‌స్టేషన్ అనే మ్యూజిక్ ఇన్స్ర్టూమెంట్ గిఫ్ట్ గా అందించాడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ. వీరిద్దరి కాంబినేషన్లో పలు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. తనకు సాయి ఇచ్చిన గిఫ్ట్ గురించి తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ ఈ లవ్‌లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్‌ప్రైజ్. ప్రతిరోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేసారు. సాయి చాలా మంచి వ్యక్తి ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నానంటూ ట్విట్టర్ లో ఫొటోతో సహా పోస్ట్ చేసాడు.
ప్రస్తుతం సినిమా రంగంలో సంగీత దర్శకులు ఎన్నో కొత్తరకం ఇన్‌స్ట్రుమెంట్లు వాడుతున్నారు. చాలా వరకు అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలే. ఎలక్ట్రానిక్ కీబోర్డ్, ఎలక్ట్రిక్ గిటార్, రిథమ్ ప్యాడ్స్, ఎలక్ట్రానిక్ ఫ్లూట్.. ఇలా చాలా రకాలున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ లాంటి సంగీత దర్శకులైతే ప్రపంచ వ్యాప్తంగా జల్లెడ పట్టి మరీ కొత్తరకం పరికరాలు తీసుకొస్తారు. అయితే, ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఒక కొత్త మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంది. దాని పేరు పెర్ల్ మాలెట్‌స్టేషన్. దీనిపై ఎలాంటి సౌండ్ అయినా వచ్చేస్తుంది. కీబోర్డ్, డ్రమ్స్ ఇలా రకరకాల సౌండ్స్ దీనిపై వాయించొచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







