IOCLలో ఉద్యోగాలు: నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి

- November 25, 2019 , by Maagulf
IOCLలో ఉద్యోగాలు: నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 నవంబర్ 2019.

సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 37
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 నవంబర్ 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా
వయస్సు: 26 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: ఫీజుకు సంబంధించిన వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 నవంబర్ 2019
మరిన్ని వివరాలకు లింక్: https://www.iocl.com/?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com