యూఏఈ: మరణాలపై సమీక్ష..సర్వే లో వెలుగుచూసిన ఆసక్తికర విషయాలు
- November 27, 2019
యూఏఈ: కాలంతో పరుగులు తీస్తూ సంపాదించే ధ్యాసలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు కొందరైతే, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వాళ్ళు కొందరు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, మృత్యువు కబళిస్తూనే ఉంది..తాజాగా దుబాయ్ లో మృతి చెందిన 24 ఏళ్ళ కేరళ వాసి ఇందుకు సాక్ష్యం. మరి ఏంటి ఈ మరణాలకు కారణాలు? యూఏఈ లో పెరిగిపోతున్న మరణాలపై డాక్టర్లు ఏమంటున్నారో చూడండి..
ఈ నెలలో క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అబుధాబి నిర్వహించిన సర్వేలలో కొన్ని విషయాలు వెలుగుచూశాయి. యూఏఈ లో దాదాపు సగం మంది పురుషులు తాము డాక్టర్లను చూడటానికి చాలా ఇబ్బంది పడ్డామని లేదా తగినంత సమయం లేదని వెల్లడించారు.
40 శాతం మంది పురుషులు లక్షణాల ద్వారా ప్రాంప్ట్ చేస్తే తప్పించి సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఎప్పుడూ వెళ్లలేదని వెల్లడించారు. అదనంగా, సగం మందికి పైగా పురుషులు అంటే 57 శాతం మంది, వారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే మాత్రమే వైద్యుడిని సందర్శిస్తామని చెప్పారు. వైద్యుడిని తప్పించటానికి ప్రధాన కారణాలు ఏమిటంటే, పురుషులు చాలా బిజీగా ఉన్నారని, భయపడుతున్నారని లేదా వారి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పారు.
"ఈ ఆలోచన సరైనది కాదు..వ్యాధిని ముందుగానే గుర్తించడం ప్రాణాలను కాపాడుతుంది మరియు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ ప్రతి ఒక్కరు చేయించుకోవాలి అని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అబుదాబిలోని యూరాలజిస్ట్ డాక్టర్ జాకీ అల్మల్లా చెప్పారు. పురుషులకంటే మహిళలే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారనీ, పురుషులు మాత్రం తమ ఆరోగ్య సమస్యలను చర్చించడానికి ఇష్టపడట్లేదు తద్వారా అనారోగ్యాలు సకాలంలో గుర్తించబడవు మరియు సమస్యలు పెరిగిపోయే అవకాశాలే ఎక్కవ" అని ఆయన అన్నారు. "ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే పురుషులు చాలా స్ట్రెస్ ను అనుభవిస్తారు. బలంగా, స్వతంత్రంగా ఉండాలనే ఆలోచనకు అనుగుణంగా జీవించడానికి మరియు వారి కుటుంబం యొక్క అవసరాలు ఎప్పటికప్పుడు నెరవేర్చే క్రమంలో ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు" అని డాక్టర్ అల్మల్లా చెప్పారు.
కాబట్టి క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ ప్రతి ఒక్కరు చేయించుకోవాలి అని వైద్యులు ఇస్తున్న సలహాను పాటించండి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







