హైదరాబాద్ ఇండియాకి రెండో రాజధాని...కేంద్రం క్లారిటీ!

- November 27, 2019 , by Maagulf
హైదరాబాద్ ఇండియాకి రెండో రాజధాని...కేంద్రం క్లారిటీ!

హైదరాబాద్‌ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని ఒకసారి లేదా దేశానికి హైదరాబాద్ ని రెండో రాజధానిగా చేస్తారని గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదన మరో సారి తెరమీదకు వచ్చింది. కొందరు బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ చేసిన ప్రచారంతో హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందనే విశ్లేషణలు ఈ వాదనకి మరింత ఊతం ఇచ్చాయి. మొన్ననే ఈ విషయం మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ రోజు ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టే ఆలోచన తమకు లేదని కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది. దేశంలో రెండో రాజధానిని ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వకంగా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com